పొన్నూరు పట్టణంలోని 14వ సచివాలయం అడ్మిన్ రమేష్ కు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మెమో జారీ చేశారు. ఆధార్ కేంద్రం అప్డేట్ కు వచ్చిన ప్రజల పట్ల నిర్లక్ష్య ధోరణ వహించినందుకు ఫిర్యాదులు అందాయి. మున్సిపల్ ఆర్ఐ వెంకటేశ్వరరావును విచారణధికారిగా పంపగా అడ్మిన్ రమేష్ నిర్లక్ష్యం రుజువు కావడంతో మెమో జారీ చేసినట్లు పేర్కొన్నారు. సిబ్బంది ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని హెచ్చరించారు.