గుంటూరు జిల్లా పొన్నూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆరు అర్జీలు అందినట్లు డిప్యూటీ తహశీల్దార్ వెంకట్రావు మీడియాకు తెలిపారు. అర్జీలను పరిశీలించి ఆయా శాఖలకు పంపి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ , ఎంఈఓ, ఏఓ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.