పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు మంత్రి పదవిని టిడిపి అధిష్టానo ఇవ్వకపోవడాన్ని పొన్నూరు పట్టణ, మండల ముస్లిం మైనారిటీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. గురువారం స్థానిక షాదీ ఖానాలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి పై పోరాటాలు చేసిన ఒకే ఒక వ్యక్తి ధూళిపాళ్ళ అన్నారు. అధిష్టానం పై పోరాటానికైనా సిద్ధమేని వారు సమావేశంలో తీర్మానించారు.