పొన్నూరు: మృతుడు దేవరాజ్ కుటుంబానికి న్యాయం చేయాలి

పొన్నూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన నక్కల దేవరాజ్ శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఆదివారం మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొందుగల చైతన్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ వైద్యశాల వద్ద మీడియాతో మాట్లాడారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి మృతుడి కుటుంబానికి 5ఎకరాల భూమితోపాటు 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకూ ఆందోళన చేపడుతామన్నారు.

தொடர்புடைய செய்தி