పొన్నూరు: అధిష్టానం పైఅసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు ఇటీవల తెదేపా విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో కానీ క్యాబినెట్ హోదా లో కానీ స్థానం దక్కకపోవడంతో చేబ్రోలు తెదేపా శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మండల తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ధూళిపాళ్లకు పార్టీ పదవులలో స్థానం దక్కకపోవడం వారు దీటుగా పార్టీని నిలదీశారు.

தொடர்புடைய செய்தி