పొన్నూరు: ఎమ్మెల్యే ధూళిపాళ్లకు మద్దతుగా బిసి సంఘాల నాయకులు

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్లకు మంత్రి పదవి ఇవ్వాలని తెదేపా బీసీ సంఘం నాయకులు శనివారం తెదేపా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మద్దతు తెలిపారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా తిరుగులేని మెజారిటీతో గెలిచిన ధూళిపాళ్లకు మంత్రి పదవిని అధిష్టానం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం వైఖరిపై బీసీ సామాజిక వర్గం అసంతృప్తితో ఉందని పేర్కొన్నారు. ధూళిపాళ్లకు న్యాయం జరిగే వరకూ అధిష్టానంపై పోరాడతామన్నారు.

தொடர்புடைய செய்தி