నేడు తాడేపల్లిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

తాడేపల్లి పట్టణంలోని డోలాస్ నగర్లో 132 కెవి లైన్ కండక్టర్ మార్చుతున్న సందర్భంగా మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని సోమవారం తాడేపల్లి లో డీఈ సురేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని నులకపేట, డోలాస్ నగర్, ప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ అసౌకర్యానికి ప్రజలు సహకరించవలసిందిగా కోరారు.

தொடர்புடைய செய்தி