దాచేపల్లి:యువకుడు ఆత్మహత్య

మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. దాచేపల్లి నగర పంచాయతీలోని ముత్యాలంపాడురోడ్డులో నివాసం ఉంటున్న శివంగుల అమర్‌నాథ్‌(34) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అవివాహితుడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జి. పాపారావు తెలిపారు.

தொடர்புடைய செய்தி