జగన్ మోహన్ రెడ్డి తప్ప అందరు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 13, 326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించిన, తీర్మానాలు చేయించి అభివృద్ధి పనులు మొదలు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రతిఒక్కరు అభినందిస్తున్నారన్నారు.