చిలకలూరిపేట: చెత్తసేకరణలో కూడా దోపిడీ చేసిన వైసీపీ ప్రభుత్వం

దేశంలో చెత్త మీద కూడా పన్ను వేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని పుల్లారావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చలో మాట్లాడుతూ పన్ను చెల్లించకపోతే చెత్త తెచ్చి ఇంటి ముందు వేస్తామని ప్రజలను బెదిరించిన చెత్త ప్రభుత్వం నాటి వైసీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. జగన్ జమానాలో అనేక చోట్ల ఇంటి పన్ను కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా చెత్త పన్ను వసూలు చేశారని ప్రత్తిపాటి అన్నారు.

தொடர்புடைய செய்தி