ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో చిలకలూరిపేట శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను శనివారం ప్రస్తావించారు. ముందుగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న తేమ సమస్య గురించి మాట్లాడుతూ గతంలో మార్కెట్ యార్డులో ప్రభుత్వ సీసీఐ కొనుగోలు ఉండేదని, ఇప్పుడు జిన్నింగ్ మిల్లో పెట్టడం వల్ల సిసిఐ బయ్యర్లు పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందని, నల్లకాయ వచ్చిందని చెప్పి తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు.