మా కార్యకర్త మరణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణం: హనిమిరెడ్డి

బల్లికురవ మండలం, చిన్న జమ్మలమడక గ్రామానికి చెందిన, వైసిపి కార్యకర్త చింతల. శ్రీను టిడిపి దౌర్జన్యాలు, వేధింపులు తాళలేక ఈనెల 21వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. ఆయన భౌతిక కాయానికి అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇంఛార్జి పానెం. చిన్న హనిమిరెడ్డి నివాళులర్పించారు.శ్రీను మరణం ముమ్మాటికి పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி