అద్దంకిలో 7 బాణాసంచా దుకాణాలకు అనుమతులు: ఎస్ఐ

అద్దంకి పట్టణంలో మొత్తం 7 బాణా సంచా దుకాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు అద్దంకి ఎస్సై ఖాదర్ భాషా తెలిపారు. బాణాసంచా విక్రయ కేంద్రాలను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ, అనుమతులకు లోబడి విక్రయాలు జరుపుకోవాలని యజమానులకు సూచించారు. అనుమతులు లేకుండా బాణాసంచా నిల్వచేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி