అద్దంకి పట్టణంలోని పలు దాబాలు, లాడ్జీలను సోమవారం రాత్రి ఎస్సై ఖాదర్ బాషా తనిఖీ చేశారు. లాడ్జిలలో ఉన్న కస్టమర్లతో మాట్లాడి ఎస్సై వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కస్టమర్ల వివరాలను వారి దృవీకరణ పత్రాలతో తీసుకోవాలని ఆయన లాడ్జి యజమానులకు సూచించారు. అనంతరం దాబాల యజమానుల వద్దకు వెళ్లి అనుమానిత వ్యక్తులపై ఆరా తీశారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీస్ వారికి సమాచారం అందించాలని సూచించారు.