అద్దంకిలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సోమవారం ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు మాట్లాడుతూ కరోనా సమయంలో తాము ప్రాణాలు పణంగా పెట్టి పని చేశామని అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు జీతాలు పెంచాలని కోరారు. అనంతరం తాసిల్దార్ శ్రీ చరణ్ కు వినతి పత్రం అందజేశారు.