అద్దంకి మండలం సింగరకొండ పాలెం శివారులోని గ్రామానికి చెందిన శ్రీనివాసరావు తన భార్య ఈనెల 22వ తేదీన ఇంటి నుంచి బ్యాంకు పనుల నిమిత్తం తాళ్లూరికి వెళ్లి తిరిగి రాలేదని పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఖాదర్ భాషా తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం వీరికి వివాహమైనట్లు భర్త శ్రీనివాసరావు ఫిర్యాదుల పేర్కొన్నారని ఎస్సై చెప్పారు.