AP: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు అద్దె సేవలను అందుబాటులోకి తెచ్చింది. కనీసం 5 రోజుల పాటు బస్సును అద్దెకు తీసుకునే గ్రూపులకు గురుస్వామికి రూ.2 వేల కమిషన్తో పాటు ఏడుగురు సహాయకులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది. వంటవారు, మణికంఠలు, ఇతర సహాయకులు ఇందులో ఉంటారు. అద్దె బస్సుల్లో ఆడియో, వీడియో సదుపాయాలు కూడా ఉంటాయి. బస్సు రకాన్ని బట్టి కిలోమీటరుకు రూ.52 నుంచి రూ.120 వరకు అద్దె నిర్ణయించగా.. అదనంగా 5% జీఎస్టీ వర్తిస్తుంది. వివరాల కోసం సమీప ఏపీఎస్ఆర్టీసీ డిపోను సంప్రదించాలని సంస్థ సూచించింది.