వైవీయూ: విద్యార్థుల ప్రయోజనమే లక్ష్యంగా ప్రాజెక్టులు

విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనమే లక్ష్యంగా ప్రాజెక్టుల రూపకల్పన చేశామని యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ కె. కృష్ణారెడ్డి పేర్కొన్నారు. 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ' కార్యక్రమంలో భాగంగా పలు ప్రాజెక్టుల ప్రతిపాదనల తయారీపై వీసీ, రిజిస్ట్రార్ పి. పద్మలు ఆచార్యులతో మంగళవారం సమావేశమయ్యారు. చంద్రఓబులరెడ్డి, టి. చంద్ర శేఖర్, డీఆర్ సతీష్ బాబు తయారు చేసిన ప్రతిపాదనలను ఉన్నత విద్యామండలికి పంపినట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி