పెండ్లిమర్రి మండలం గంగనపల్లి పంచాయతీ పోలతల క్షేత్రంలో.. శుక్రవారం కార్యనిర్వహణ అధికారి కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఏర్పాట్లను చేయాలన్నారు. భక్తులు వచ్చేందుకు వీలుంటే విధంగా రోడ్డు సదుపాయం, త్రాగునీటి సౌకర్యం, కోనేరు శుభ్రం చేయడం, తదితర వాటిపై చర్చించారు.