విశాఖపట్నం 87వ వార్డు శ్రీ తిరుమల నగర్ కాలనీ, జల శక్తి మంత్రిత్వ శాఖ నుంచి ఐదవ జాతీయ వాటర్ అవార్డు గెలుచుకుంది. తిరుమల నగర్ నివాసితులు పరిశుభ్రత, నీరు సంరక్షణ, సేంద్రియ ఎరువుల తయారీ వంటి అంశాల్లో ముందంజలో ఉండి, ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల నగర్ సంక్షేమ సంఘం సభ్యులను మంత్రులు అభినందించారు. దీంతో కాలనీలో ఆదివారం వేడుకలు నిర్వహించారు.