AP: ప్రకాశం జిల్లా, మేదరమెట్ల మండలం తమ్మవరంలో బుధవారం సాయంత్రం 25 వైసీపీ కుటుంబాలు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో టీడీపీలో చేరాయి. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, టీడీపీ నాయకులు రామిరెడ్డి ఆంజనేయులు, కరిచేటి రాంబాబు, రామిరెడ్డి వీరాంజనేయులుల సమక్షంలో మంత్రి రవికుమార్ వైసీపీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు పాణ్యం శ్రీనివాసరావు, మాజీ ఉప సర్పంచ్ యద్దనపూడి చింపిరయ్య వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు.