హనుమకొండ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు

80பார்த்தது
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మార్చి 5వ తేదీ నుండి ప్రారంభమవుతున్న పరీక్షల నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ, వైద్య, పోస్టల్, ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్, తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ అంశాలను కలెక్టర్ కు వివరించారు.

தொடர்புடைய செய்தி