వరంగల్ 42వ డివిజన్ రంగశాయిపేటలోని అతి పురాతన దేవాలయం శ్రీ సీతారాచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సీతారాములవారి కళ్యాణ మహోత్సవం ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ పులిగిల్ల వెంకట రామ నరసింహ శాస్త్రి, ఆలయ ఈవో ఆధ్వర్యంలో అతి వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల శ్రీధర్ ఆచార్యులు, గ్రామ పురోహితులు వేద పండితుల వేదమంత్రాలతో కళ్యాణ మండప ప్రాంగణం రామ నామాలతో మార్మోగింది.