తన భర్త రాజలింగం హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని మృతుడి భార్య సరళ ఆదివారం డిమాండ్ చేసింది. భూ వివాదం కారణంగా హత్య జరగలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కోర్టుకు వెళ్లడంతోనే దారుణ హత్యకు గురయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నీ ముందుండి నడిపించాడని ఆరోపించింది. అప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్గా ఉన్న తనను ఏతప్పు చేయకున్నా పార్టీ నుంచి సస్పెండ్ చేశారంది.