
పరిగి: ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కిరణ్
పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం జంగంరెడ్డి పల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్ ఛార్జ్ మారుతీ కిరణ్ బూనేటి ఆదివారం సాయంత్రం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు హరికృష్ణ యాదవ్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు వెంకటయ్య, పరిగి మండల అధ్యక్షులు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.