అందోలు- జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించిన సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్ ఎంట్రీని సుల్తాన్పూర్ జేఎన్టీయూలో ఆర్డీవో పాండు బుధవారం పరిశీలించారు. ఇంటికి సంబంధించి ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి, డిప్యూటీ తహశీల్దార్ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.