గీత కార్మికులకు 340 దుకాణాల కేటాయింపునకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నవంబర్ 15 లోపు దుకాణాల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీలో మద్యం దుకాణాలను పారదర్శకంగా కేటాయించామన్నారు. మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్ కమిటీ వేస్తామని, డిస్టిలరీస్‌ను టెండర్ కమిటీ సంప్రదించి ధరలు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.