తెలంగాణకు రావాల్సిన హక్కులు, హోదాలు, నిధులను ఎగ్గొట్టి... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ అప్పులపై గురువింద నీతులు చెప్పే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని బీఆర్ఎస్ విమర్శించింది. దేశాన్ని అప్పుల్లో ముంచిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చెందిందని తెలిపింది. సిగ్గుమాలిన విధంగా కేంద్రం పార్లమెంట్ వేదికగా మరోసారి తెలంగాణపై విషం చిమ్మిందని బీఆర్ఎస్ 'X' వేదికగా మండిపడింది.