ధాన్యం సేకరణ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి మంత్రులు, ఇన్చార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో కోరారు. వానకాలం ధాన్యం సేకరణ పై మంగళవారం అయన న్యూఢిల్లీ నుండి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణలో భాగంగా అకాల వర్షాల వల్ల రైతుల ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలును సకాలంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.