తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలి: నాగర్ కర్నూల్ కలెక్టర్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో సిబ్బంది కచ్చితమైన సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శనివారం తెలకపల్లి మండలంలోని చిన్న ముద్దునూరు, రామ్ రెడ్డి పల్లి, చిన్న ముద్దనూరు గ్రామాల్లో జరుగుతున్న సర్వే తీరును జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్వయంగా పరిశీలించారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా గ్రామాల్లోని ప్రతి ఇంటిని సర్వే మొదలు పెట్టాలని సూచించారు.