ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా రేపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి, కుమారుడు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి రాజకుమారి (55), కుమారుడు నాగేంద్ర (26) మృతికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి, కొడుకు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.