ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలు బుధవారం వేమనపల్లి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కుబుడే వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించార. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మధుకర్, కార్యవర్గ సభ్యులు వెంకటేష్, సాయి కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.