నాగర్ కర్నూలు: చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో నాగన్న (20) వైజాగ్ కు చెందిన మత్స్యకారుడు కృష్ణానదిలో మంగళవారం మృతి చెందాడు. నిషేధిత అలివి వలతో చేపలవేటకు కూలికి వచ్చి పని ఒత్తిడి భరించలేక పారిపోతూ పడవ బోల్తాపడి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.