డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగమే బీజేపీ అజెండా అని మాజీ ఎమ్మెల్సీ, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరం జెడ్పీసెంటర్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆయన శుభ్రం చేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేసేది కేవలం బీజేపీ మాత్రమేనన్నారు.