తాడేపల్లిగూడెం:అసెంబ్లీలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గళం
ఏపీ శాసనసభ సమావేశాల్లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమస్యలపై తమ గళాన్ని వినిపించారు. ఎర్ర కాలువ ముంపుకు సంబంధించి శాశ్వత పరిష్కారానికి జలవనరుల శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ ఎర్ర కాలువ ముంపు వల్ల తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు మండలాల్లోని రైతులు ప్రతి ఏటా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.