పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం
పోలవరం వద్ద గోదావరి ఉగ్రంగా మారింది. అనూహ్యంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో పోలవరం ప్రాజెక్టు నుంచి 10,39,627 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. దీంతో మంగళవారం వరద నీరు పట్టిసీమ శివక్షేత్రాన్ని చుట్టుముట్టింది. పోలవరం మండలం ఎల్ఎన్డి పేట వద్ద కొవ్వాడ రిజర్వార్ నుంచి గత రాత్రి 480 క్యూసెక్కులు, ఉదయం 360 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్ నీటిమట్టం 89. 70 మీటర్లు నమోదయింది.