ఉండి: వృద్ధురాలిపై వ్యక్తి అత్యాచారయత్నం
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పొందువ్వ గ్రామానికి చెందిన 65ఏళ్ల వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన 39 ఏళ్ల కాసుమళ్ళ రమేష్ అనే వ్యక్తి శనివారం రాత్రి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దౌర్జన్యంగా ఆమె ఇంట్లో ప్రవేశించి ఆమె వద్ద నుంచి రూ. 4వేలను లాక్కుని పరారయ్యాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.