నరసాపురం: యుద్ధ ప్రాతిపదికన ఓటర్ల లిస్టు సిద్ధం చేయాలి
నరసాపురం తహశీల్దార్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మార్వో రాజేశ్వరి పాల్గొన్నారు. నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నరసాపురం తహశీల్దార్ టి. రాజరాజేశ్వరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పునరుద్ధరించిన నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఓటర్లలిస్టు సిద్ధం చేయాలన్నారు.