Oct 26, 2024, 09:10 IST/
మాజీ మంత్రి తమ్ముడికి షాక్
Oct 26, 2024, 09:10 IST
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. మహబూబ్ నగర్లోని సర్వే నెంబర్ 523 అక్రమాల్లో ఏ4 నిందితుడిగా శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. సాక్ష్యాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ కోర్టు శ్రీకాంత్ గౌడ్ కు 14 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ను పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించారు.