పెందుర్తి: రూ. 50, 000 విరాళం అందించిన కంఫర్ట్ హోమ్ నివాసితులు
విజయవాడ వరద బాధితులకు పెందుర్తి 95వ వార్డుకు చెందిన కంఫర్ట్ హోమ్స్ నివాసితులు రూ. 50, 000 విరాళంగా అందజేశారు. పెందుర్తి మండలం సుజాతనగర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సూర్యనారాయణ ద్వారా చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ కు మంగళవారం పంపించారు. ఈ కార్యక్రమంలో కంఫర్ట్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి రామకృష్ణా, కార్యదర్శి ఎం. సత్యనారాయణ పాల్గొన్నారు.