కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాలను ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా ఉచితంగా కేటాయించాలని గీత కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర దేముడు డిమాండ్ చేశారు. పెందుర్తి మండలం నరవ గ్రామంలో ఆదివారం గీత కార్మికుల మహాసభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ మద్యం షాపుల కేటాయింపును 20 శాతానికి పెంచాలన్నారు. నీరాతాటి ఉత్పత్తుల పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నారు.