గుర్రంకొండ ఏఎస్ఐ మోసెస్ పై కేసు నమోదు
గుర్రంకొండ ఏఎస్ఐ మోసెస్ పై కేసు నమోదు చేసినట్లు మదనపల్లి రెండవ పట్టణ ఎస్సై రవికుమార్ తెలిపారు. ఏఎస్ఐ మోసెస్ మదనపల్లి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటూ తనను పట్టించుకోకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఆయన భార్య ఎస్తేరు రాణి శనివారం రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిఐ రామచంద్ర ఆదేశాలతో ఏఎస్ఐ పై కేసు నమోదు చేశారు.