టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దివ్వెల మాధురి
టెక్కలికి చెందిన వైసీపీ మహిళా కార్యకర్త దివ్వెల మాధురి ఆదివారం టెక్కలి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన క్రమంలో గందరగోళం నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమెను టెక్కలి పోలీస్ స్టేషన్ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో వాదించారు. సోషల్ మీడియాలో తనపైన అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆమె సీఐ విజయ్ కుమారు ఫిర్యాదు చేశారు.