పెనుగొండ: మంత్రి సవితను సన్మానించిన డీవీ అంజనేయులు
బీసీ సంక్షేమ శాఖా మంత్రి సవితను రాష్ర్ట వాల్మీకి కార్పోరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు సన్మానించారు. రాష్ర్ట వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా తనను నియమించినందుకు ఆదివారం పెనుకొండలోని మంత్రి నివాసంలో సవితను కలసి పూల మాలలు వేసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ. కష్టపడిన ప్రతి కార్యకర్తను టీడీపీ గుర్తిస్తుందని, పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని తెలిపారు.