పొన్నూరు: పోస్ట్ కార్డు ద్వారా వాలంటీర్ల నిరసన ప్రదర్శన
రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ అనుబంధం సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వాలంటీర్ లు ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం ఉత్తరం పోస్ట్ చేసి నిరసన తెలిపారు. రాష్ట్ర వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దె వెంకట భవాని ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలో భాగంగా 10 వేల రూపాయలు వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పట్టణ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.