ముత్తుకూరు: సిపిఎం ప్రజా పోరు యాత్ర
ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం పార్టీ గురువారం ప్రజా పోరు యాత్ర మహా ధర్నా కార్యక్రమాన్ని ముత్తుకూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించింది. మండల పార్టీ కార్యదర్శి అంకయ్య ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పార్టీ సీనియర్ నాయకులు నక్కా రాధయ్య, ఆటో కార్మికులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మూడు అంశాలపై రెవెన్యూ శాఖ అధికారులకు సిపిఎం పార్టీ నాయకులు వినతి పత్రం ఇచ్చారు.