చాగల్లు మండలంలో దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలికంగా బాణాసంచా సామాగ్రి అమ్ముకునే వర్తకులకు.. సోమవారం సాయంత్రం చాగల్లు పోలీస్ స్టేషన్ లో చాగల్లు ఎస్ఐ కె.నరేంద్ర బాణసంచా షాపులు వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసారు. ఉత్తర్వులు అత్యక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణాసంచా షాపుల వద్ద సేఫ్టీ ప్రికాషన్స్ కచ్చితంగా పాటించాలని, ప్రజల భద్రతలో ఎటువంటి రాజీలేదని చట్టపరమైన చర్యలు తీసుకోంటామని తెలిపారు.