సామర్లకోట: ఆర్టీసీ బస్ బ్రేక్ ఫెయిల్
కాకినాడ నుండి ఏలేశ్వరం డిపోకు ప్రయాణిస్తున్న బస్ బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి సుమారు 83 మంది ప్రయాణికులతో ఏలేశ్వరం బయలుదేరిన బస్సు సామర్లకోట జగనన్న కాలనీ వద్దకు వచ్చేసరికి బ్రేక్ పని చేయకపోవడంతో డ్రైవర్ సిహెచ్ఎ రావు చాకచక్యంగా వ్యవహరించారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఐఎంఎల్ డిపో సమీపంలో బస్సును ఆపారు.