సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన వేమూరు ఎమ్మెల్యే
అమర్తలూరు మండలం పాంచాలవరం గ్రామానికి చెందిన బొడ్డు లక్ష్మీ తిరుపతమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ఆమెకి 61, 679 రూపాయలు మంజూరయ్యాయి. అమర్తలూరు మండలం మోపర్రు గ్రామానికి చెందిన గోగినేని వెంకట సాంబశివరావుకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద 37, 205 రూపాయలు మంజూరయ్యాయి. ఆదివారం గుంటూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీరికి చెక్కులను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అందజేశారు.