పొన్నూరు: రేపటి నుంచి 22 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు
గుంటూరు జిల్లా పొన్నూరు పురపాలక సంఘం పరిధిలోని 17 సచివాలయాల పరిధిలో రేపటి నుంచి ఈనెల 22 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు కార్యాలయంలో మీడియాకు తెలిపారు. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ క్యాంప్ కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రజలు తమ ఆధార్ కార్డులో సమస్యలను కేటాయించబడిన కేంద్రాలలో పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.